Siricilla: కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం రూ. 7000 వసూలు చేసిన కాంగ్రెస్ నేత

-

Siricilla: కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారు. కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం రూ. 7000 వసూలు చేసాడు ఓ కాంగ్రెస్ నేత. హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళను కూడా వదలేదు కాంగ్రెస్ పార్టీ నేతలు. 2 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు గోడు వెళ్లబోసుకుంది ఓ మహిళ. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

revanth reddy

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చంద్రకళ అనే మహిళ తన బిడ్డ పెళ్లి చేయగా ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) అనే యువకుడికి రూ. 7000 ఇచ్చింది. శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండగా 178 లబ్దిదారుల లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆగ్రహంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్ద ఈ విషయం చెప్పి వాపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చోటును పిలిచి మందలించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version