తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కుంజ సత్యవతి గుండెపోటుతో మరణించారు. నిన్న రాత్రి ఆమెకు తీవ్ర చాతినొప్పి రావడంతో… హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించారు.
![Former Bhadrachalam MLA and BJP leader Kunja Satyavathy](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/1500x900_271084-kunja-satyavati.jpg)
2009 సంవత్సరంలో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కుంజ సత్యవతి. ఆ తర్వాత బిజెపి పార్టీలో చేరిన సత్యవతి.. ఇప్పటివరకు ఎమ్మెల్యే కాలేకపోయారు. ఇక తాజాగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బిజెపి పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కుంజ సత్యవతి మృతి పట్ల బిజెపి నేతలు ఇతర రాజకీయాన్ని నాయకులు సంతాపం తెలుపుతున్నారు.