బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి బనకచర్ల ఎక్కడ ఉందో తెలియకుండా దాన్ని అడ్డుకుంటాడా ? అని నిలదీశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

రైతులకు బాకీ ఉన్న డబ్బులు నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం పండబెట్టి పంటలు ఎండబెట్టిండు… వరంగల్ ఎస్ఆర్ఎస్పీ లోని డీబీఎం – 38 అనే అతిపెద్ద కాలువ పూర్తిగా ఎండిపోయిందని పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఒక్క ఎకరం భూమి ఉన్న రైతుకు రూ.25,000 బాకీ ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు రూ.6,000 వేస్తే మిగతా రూ.19,000 నీ అయ్య మొగుడు ఇస్తాడా రేవంత్ రెడ్డి ? అని నిలదీశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.