20 ఏళ్ల రాజకీయ జీవతంలో ఏనాడూ తప్పుడు సిఫార్సు చేయలేదు – మాజీ ఎంపీ వినోద్

-

ఛాలెంజ్ చేసి చెప్తున్నా … 20 ఏళ్ల రాజకీయ జీవతంలో ఏనాడూ తప్పుడు సిఫార్సు చేయలేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్ ప్రతిమ హోటల్ లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. చుట్టాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రికమండేషన్ చేసినానని వచ్చిన వార్తలపై స్పందించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. జర్నలిజం విలువలు తెలియని వాళ్ళు జర్నలిజం చేసి వార్తలు రాయాలని మండిపడ్డారు.

తీన్మార్ మల్లన్న వార్తలు వేసే ముందు జర్నలిజం గురించి తెలుసుకోవాలని హెచ్చరించారు. బిజెపి సోషల్ మీడియాలో వేసిన వార్త ఏ ఆధారాలతో వేశారని ఫైర్‌ అయ్యారు. ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి అంటూ నిలదీశారు. సోషల్ మీడియాలో ప్రపంచమంతా తిరిగిన అబద్ధ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎవరేం చేసారు అనేది అన్ని బయట పెడతానని వార్నింగ్‌ ఇచ్చారు కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్ కుమార్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version