అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు తెలుగువాళ్లు మృతి

-

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ వ్యాను, ట్రక్కు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మినీ వ్యానులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన నలుగురూ తెలుగువాళ్లేనని సమాచారం. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version