తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేద మందులతో పాటు..సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది.అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు. తులసి తైలాన్ని స్ప్రేలలో, పన్నీరులో, స్వీట్లలో వాడుతారు. తులసికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉండటంతో చాలా మంది రైతులు దీని సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మనదేశంలోనే కాదు థాయిలాండు, గ్వాటిమాలా, కొన్ని ఆఫ్రికా దేశాలలో తులసి వాణిజ్య సరళిలో సాగవుతుంది. మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపుర, చందౌసీ, కనేజ్, లక్నో, తదితర ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు. అన్ని రకములైన భూములలోని ఇది ప్రకృతి సిద్ధంగానే సాగు చేయవచ్చు. నీరునిలిచే ప్రదేశాలు పనికిరావు. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో సాగుకు అనుకూలమైన పంట..
14 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంగ్రే వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. మంచుపడి వాతావరణం అనుకూలం కాదు. ఇది విత్తనాల ద్వారా ప్రవర్ధనము చేందుతుంది. ఎకరానికి 200 గ్రాముల విత్తనం అవసరమౌతుంది. విత్తనానికి 8 రెట్ల ఇసుకతో కలిపి తయారు చేసుకొన్న నారుముళ్లలో ఏప్రిల్, మే నెలలో చల్లుకొని నారు పెంచుకోవాలి. ఒక నెలలో నారు నాటుకువస్తుంది. 8నుండి13 రోజులలో మొత్తం విత్తనం మొలకెత్తుతుంది. పంట ఆరోగ్యం కోసం పశువుల ఎరువును ఎకరానికి 6-8 టన్నులు వెయ్యాలి..
నత్రజని, ఫాస్పరస్, పొటాష్ వంటివి భూమిని ఒకసారి లోతుగా దున్నుకొని పశువుల ఎరువు వేసి, భూమిలో బాగా కలిసేట్లు దున్నుకోవాలి. మొక్కలు నాటే ముందు తిరిగి దున్నుకొని రసాయనిక ఎరువువేసి నాగలితో సాళ్లు తోలుకోవాలి. తయారుచేసుకొన్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంతో మొక్కలను నాటుకోవాలి.
మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, 60 రోజుల తరువాత మరొకసారి కలుపు తీసుకోవాలి. ఆ తరువాత మొక్కలు పెరిగి విస్తరించబడిన కలుపు తీసుకొని ఎరువులు వేస్తుండాలి..వాతావరణ పరిస్థితులను బట్టి వారానికి ఒకసారి నీళ్లను అందించాలి..ఇంకేమైనా సమస్యలు ఉంటే దగ్గరలోని వ్యవసాయ నిపుణులను అడగటం మంచిది.