కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్తు రద్దే – మంత్రి కేటీఆర్

-

రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ రద్దయినట్లేనని అన్నారు మంత్రి కేటీఆర్. శనివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు వేదిక వద్ద రైతులు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతన్నలకు మూడు గంటల విద్యుత్ చాలన్న కాంగ్రెస్ విధానంపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలన్నారు.

ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బిఅర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. ఈనెల17 నుంచి పది రోజులపాటు రైతు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతులకు కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. దీంతో మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం – మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానం పేరిట ఈ సమావేశాలు నిర్వహించనున్నారు బిఅర్ఎస్ శ్రేణులు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల బీఆర్ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తేల్చుకోవలసిన తరుణం ఇదేనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version