14 నుంచి ‘గాంధీ’ సినిమా ఉచిత ప్రదర్శన చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఈనెల 14-24 వరకు తెలంగాణ రాష్ట్రంలో 582 థియేటర్లో ‘గాంధీ’ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నారు.
అన్ని వర్గాల ప్రజలు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 15-20 తేదీల్లో చిత్ర ప్రదర్శన ఉండదని చెప్పారు. విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని పెంచేలా గతంలోనూ ఉచితంగా షోలు వేసినట్లు మంత్రి వెల్లడించారు. ‘గాంధీ’ సినిమాను అందరూ ఆదరించాలి.. గాంధీ బాటలో ముందుకు సాగాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.