రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంప్ సెట్లు అందిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి.

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….అచ్చంపేట నియోజకవర్గంలో ఎంత మంది రైతులకు మోటార్లు ఉన్నాయో అంత మంది రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంప్ సెట్లు ఇచ్చే బాధ్యత నాది అన్నారు. పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర గత ప్రభుత్వానిది.. ఇవాళ అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు, తోటలు పెట్టి గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్న ప్రభుత్వం మాదని పేర్కొన్నారు.