ప్రయాణికులకు అలర్ట్.. పుష్పక్‌ టిక్కెట్‌తో సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

-

తెలంగాణ ఆర్టీసీ రోజుకో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త సదుపాయాన్ని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఇంతకీ అదేంటంటే..?

హైదరాబాద్​లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో పుష్పక్‌ బస్సు ఎక్కినవారు నగరంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్‌ బస్సులో టిక్కెట్‌ కొన్న క్షణం నుంచి 3 గంటలపాటు ఈ ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు చెప్పారు. విమానాశ్రయం నుంచి పుష్పక్‌ బస్సులు కొన్ని ప్రధాన ప్రాంతాలకే పరిమితమైనందున, తర్వాత ప్రయాణంలో ఈ వెసులుబాటు కల్పించామన్నారు. ఎయిర్‌పోర్టు స్టాపులో టిక్కెట్‌ కొన్నవారికే ఇది వర్తిస్తుందని.. దారిలో బస్సు ఎక్కినవారికి కాదని పేర్కొన్నారు.

మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. రోజుకు రూ.59తో సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌ను రీఛార్జ్‌ చేయడం ద్వారా ఈనెల 12, 13, 15 తేదీల్లో అపరిమితంగా మెట్రోలో ప్రయాణించవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version