భారీ వర్షాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు..

-

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దింతో మున్నేరు వాగు..ఉధృతంగా ప్రవహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో లో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తోంది మున్నేరు. మున్నేరు వాగు..ఉధృతంగా ప్రవహిస్తోన్న తరుణంలో మద్దివంచ, రాంపురం, పులిగుట్ట తండా, కొత్త తండా, రాము తండా, హోల్య తండాతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Fresh flood alert in Telangana as Munneru River crosses danger mark
Fresh flood alert in Telangana as Munneru River crosses danger mark

అటు ములుగు జిల్లాలో కుండపోత..ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వెంకటాపురంలో అత్యధికంగా 227 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. మంగపేట, వాజేడు వెంకటాపురం మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. కలెక్టరేట్ లో 18004257109 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. వరంగల్, జనగామ, హనుమకొండ, జిల్లాల్లో స్వల్పంగా వర్షం కురుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news