పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు వైజాగ్ లో గ్రాండ్ గా జరగబోతోంది. బీచ్ రోడ్ లోని AU కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తో సహా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ హాజరు కానున్నారు. ఇదివరకే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రేపు అంటే 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా …పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎప్పుడు బిజీగా ఉంటూనే తనకు సమయం దొరికినప్పుడల్లా అభిమానుల కోసం సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా అభిమానుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.