ఈ నెల 14 నుంచి లక్ష లోపు ఉన్న రైతుల రుణమాఫీ- మంత్రి హరీష్ రావు

-

ఈ నెల 14 నుంచి లక్ష లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు.  సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు ఇవాళ పర్యటించారు. బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, TSHDC చైర్మన్ చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు.

సోమవారం నాడు లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల రుణమాఫీ చేస్తామని… లక్ష రూపాయల పైన తీసుకున్న రుణాలను మరో 15 నుంచి 20 రోజుల్లో మాఫీ చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఆగమాగం ఉంది వాళ్ళకి దిక్కు లేకుండా అయిపోయిందని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 గంటలు కరెంట్ ఇస్తే మూడెకరాల పొలం పారుతుంది అన్నాడని.. అటువంటి ఆయనకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చురకలు అంటించారు. పంచాయతీ సెక్రెటరీ, VRA లు, రేషన్ డీలర్లు, ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యత్నించారన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version