కేంద్ర బడ్జెట్లో తెలంగాణ సింగరేణికి రూ.1,600 కోట్లు

-

కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్లో ఈసారి కూడా తెలంగాణకు మొండి చెయ్యే చూపించింది. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. రాష్ట్రానికి కనీస నిధులు కూడా తీసుకురాలేకపోయారు. అయితే సింగరేణి గనుల సంస్థకు మాత్రం రూ.1600 కోట్లు కేటాయించింది. అయినా గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపుల్లో రూ.50 కోట్లు తగ్గాయి.

మరోవైపు హైదరాబాద్‌లోని ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు రూ.352.81 కోట్లు కేటాయించగా.. క్రితంసారి కంటే ఇది రూ.12 కోట్లు అధికంగా ఉంది. దేశంలో అణు ఇంధన కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఖనిజాన్వేషణ కోసం ఈ సంస్థ పని చేస్తుందన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఐఐటీకి రూ.122 కోట్లే కేటాయించారు. హైదరాబాద్‌ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థకు రూ.10.84 కోట్లు, ఇన్‌కాయిస్‌కు రూ.28 కోట్లు కేటాయింపులు చేశారు. ఇక తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. వాటి కేటాయింపులను సెంట్రల్‌ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేశారు. ఇలా తెలంగాణ పంపిన ప్రపోజల్స్లో చాలా వరకు నిధుల కేటాయింపు జరగలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version