మహిళల దినోత్సవం నాడు.. కవిత కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై స్పందించారు మంత్రి గంగుల కమలాకర్. మహిళ దినోత్సవం సందర్బంగా మోడీ అడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నాడని ఫైర్ అయ్యారు గంగుల. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ నాయకుల కుట్ర అన్నారు.
గత కొద్ది రోజుల నుండి కవితపై బిజెపి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి గంగుల కమలాకర్. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వంపై బిజెపి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. మొదట నోటీసులు ఇస్తుంది.. నోటీసులకు భయపడకపోతే తర్వాత అరెస్టులు చేస్తారన్నారు. ఆ తర్వాత జైలుకు పంపుతారు.. కవితమ్మ ఎక్కడ తప్పు చేయలేదు.. అరెస్టులు చేసినా నోటీసులు ఇచ్చిన వెనుకకు తగ్గేదే లేదని వెల్లడించారు.