పీవీ కి భారతరత్న రావడం తెలుగు వారికి ఎంతో గర్వకారణం : చిరంజీవి

-

తెలంగాణ బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న ప్రకటించడం పై మెగాస్టార్ స్పందించారు. దేశానికి ఆయన చేసిన సేవలు అద్భుతం అని కొనియాడారు. దేశానికి పీవీ నరసింహ రావు గారు చేసిన సేవలు అద్భుతమని.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారానే దేశ స్థితిగతులను మార్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు.

నిజమైన దార్శనికుడు పండితుడు, బహుభాషావేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడైన తెలుగు బిడ్డకు భారతరత్న అవార్డు రావడం మనందరికీ గర్వకారణం అన్నారు. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ఆదునిక భారతదేశాన్ని మార్చివేశారు. ప్రపంచంలో భారతదేశం ఆర్థిక శక్తిగా మారడానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే.. తాను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావును భారతరత్నతో సత్కరించింది. ఇది భారతీయులందరితో పాటు తెలుగు వారికి మరింత సంతోషకరమైన విషయం. ఈ గౌరవం లభించడం ఆలస్యమైనప్పటికీ.. ఇంతకు మించిన గొప్పది ఏమి ఉండదని పోస్ట్ చేశారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version