రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ పైన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. వ్యంగ్యం ఎక్కువైంది.. వ్యవహారం తక్కువైందంటూ రేవంత్‌కు హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేశారు . శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ…..చాలా చిన్న వయసులో ముఖ్యమంత్రి కావడం తన అదృష్టమని అన్నారు. కాబట్టి వ్యంగ్యం తగ్గించుకోని, వ్యవహారం మీద దృష్టి సారించాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు.మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది. వ్యవహారం తక్కువైంది అని విమర్శించారు. చక్కగా మాట్లాడితే తప్పకుండా సహకరిస్తాం అని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పీవీని పట్టించుకోలేదు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ ఘాట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేశాం అని గుర్తు చేశారు. పీవీ కుమార్తె సురభి వాణిదేవీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాం అని అన్నారు.