గణేష్ నిమజ్జనంపై GHMC కమిషనర్ ఆమ్రపాలి కీలక ఆదేశాలు ఇచ్చారు. గణేష్ నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా జిహెచ్ఎంసి సిబ్బందికి సహకరించండని కోరారు. పదిహేను వేల మంది GHMC సిబ్బంది నిమజ్జనం డ్యూటీల్లో పాల్గొంటున్నారన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 465 క్రేన్స్.. హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ డిప్లై చేశామని తెలిపారు GHMC కమిషనర్ ఆమ్రపాలి.
అన్ని శాఖల సమన్వయంతో జిహెచ్ఎంసి నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది..రేపటి నుంచి మూడు రోజులపాటు జిహెచ్ఎంసి సిబ్బందికి అసలైన పని ఉంటుందని తెలిపారు GHMC కమిషనర్ ఆమ్రపాలి. నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ట్యాంక్ బండ్ తో పాటు GHMC పరిధిలోని అన్ని చెరువులల్లో నిమజ్జనాలు జరగనున్నాయని వివరించారు HMC కమిషనర్ ఆమ్రపాలి. నిమజ్జనంపై తొలిసారి సీఎం రివ్యూ చే శారు.. సలహాలు సూచనలు చేశారన్నారు. కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి.. పోలీసులు చూసు కుంటారని తెలిపారు.