గ్రేటర్ హైదరాబాద్ లో GIS సర్వే 136 KM పూర్తి…ఆమ్రపాలి సంచలన ప్రకటన

-

గ్రేటర్ హైదరాబాద్ లో GIS సర్వే కొనసాగుతుందని GHMC కమిషనర్ ఆమ్రపాలి సంచలన ప్రకటన చేశారు. 650 కిలో మీటర్ల విస్తరణలో ఉన్న GHMC లో ..ఇప్పటి వరకు 136 KM GIS సర్వే పూర్తి చేశామని ప్రకటించారు. ఖచ్చితమైన టాక్స్ లెక్కింపు చేస్తున్నామని… UP, MP రాష్ట్రాల్లో GIS సర్వే చేశారని గుర్తు చేశారు. రాయపూర్, ప్రయాగ సిటీ లో GIS సర్వే చేశారని తెలిపారు.

GHMC Commissioner Amrapali’s sensational announcement that GIS survey will continue in Greater Hyderabad

GIS సర్వే పూర్తి అయితే… GHMC పరిధి లో ఉన్నా అన్ని సమస్యలు పరిష్కారం చేసేందుకు ఈజీ అవుతుందని ప్రకటించారు GHMC కమిషనర్ ఆమ్రపాలి. GHMC పరిధి లో ప్రతి రోజు 7500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని వివరించారు. జూలై 30 న గ్రేటర్ హైదరాబాద్ లో
ఇంటిగ్రేటెడ్ GIS సర్వే ప్రారంభి0చింది GHMC. GIS సర్వే లో డ్రోన్ సర్వే తో పాటు… ప్రతి ఇంటికి వెళ్ళి… ఫిజికల్ గా తనిఖీ చేస్తున్నారు GHMC అధికారులు. ఈ సర్వే తో GHMC పరిధి లోని ప్రాపర్టీస్ అన్ని ప్రాపర్టీ టాక్స్ లోకి తేవడం అన్న మాట.

Read more RELATED
Recommended to you

Exit mobile version