కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు

-

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఆమె భర్త శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఈ దంపతులు ఇవాళ అధికార పార్టీ కాంగ్రెస్లో చేరారు. మోతే శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్‌ మున్షీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హస్తం తీర్థం పుచ్చుకున్న శ్రీలత, శోభన్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసుకుని ఉద్యమకారులను బీఆర్ఎస్ విస్మరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తన్నారని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమనాయకులకు సరైన న్యాయం జరగడం లేదని మోతే శ్రీలత దంపతులు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడం వల్లనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పొన్నంతో సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version