ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఇళ్లు మంజూరు చేయాలిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. తెలంగాణ రాష్ట్రానికి 1.69 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వర్గాలు తెలిపాయి. కాగ రాష్ట్రాల వారిగా వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం చర్చించనున్నారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ మంజూరు కమిటీ ఈ ప్రతిపాదనలపై చర్చించి ఇళ్లును మంజూరు చేయనున్నారు.
కాగ ఈ కమిటీ సమావేశం తర్వాత.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇళ్ల సంఖ్యపై ఒక క్లారిటీ రానుంది. కాగ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిరికీ ఇళ్లు ఇప్పించాలని చూస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా అమలు చేస్తుంది. కాగ ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలను ఇస్తుంది.