కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త..!

-

కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బంది సర్వీసును మరో నాలుగు నెలలు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మెమో జారీ చేశారు.

cm revanth reddy orders telangana dgp

వీరి సర్వీసు ఈ ఏడాది మార్చి 31 తోనే ముగియగా జులై 31 వరకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు. ఇది ఇలా ఉండగా, రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా పథకాలకు 2 నెలల్లో రూ. 30 వేల కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా. ఆగస్టులోగా ఆ మేర రుణాలు తీసుకుంటేనే స్కీమ్ ల అమలు సాధ్యమని సమాచారం. బాండ్ల విక్రయం ద్వారా అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఏప్రిల్, మేలో రూ. 8,246 కోట్లు సేకరించగా….మరో రూ. 2వేల కోట్లు 3 రోజుల్లో తీసుకొనుంది. ఈ ఏడాది కోటాలో మరో రూ. 30 వేల కోట్లు తీసుకునేందుకు RBI అంగీకరిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news