తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్రంలో బీర్లతో పాటు లిక్కర్ ధరలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిబ్రవరి మాసంలో.. కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి భారీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ నేపథ్యంలో.. స్పందన విపరీతంగా వచ్చింది.

మొత్తం 92 కంపెనీలు అలాగే 64 కొత్త బ్రాండ్లను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో 331 ఇండియన్ బ్రాండ్స్ కాక మరో 223 విదేశీ బ్రాండ్లు ఉండడం జరిగింది. పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో…. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే మద్యం ధర తగ్గే ఛాన్సులు ఉంటాయి. అదే జరిగితే తెలంగాణ మందుబాబుల పంట పండినట్లే. అతి త్వరలోనే మద్యం ధరలు తగ్గే ఛాన్సులు కూడా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ… ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.