ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులకు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. చిన్న పంచాయతీల బాధ్యతలు ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నారు గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శులు.

అయితే… వీరి విజ్ఙప్తుల నేపథ్యం లో జగన్ మో హన్ రెడ్డి సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లోని గ్రేడ్ -5 పంచాయతీ కార్యదర్శుల కు చిన్న పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం జగన్. ఇక ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కు కృతఙ్ఞతలు తెలిపారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.