తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త.. చేనేత మిత్ర పథకం కింద అర్హులైన 32 వేలకు పైగా చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రూ. 3వేల చొప్పున నగదు జమ చేసింది. ఈ పథకం కింద అందిస్తున్న సబ్సిడీలు సకాలంలో అందడం లేదని… జియో ట్యాగింగ్ ద్వారా ట్యాగ్ అయిన నేతన్నల ఖాతాల్లో ఇకనుంచి నెలకు రూ. 3,000 (యజమానికి రూ.2000, సహాయకుడికి రూ.1000)ఇవ్వనున్నట్లు మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఆదేశాలతో మెమో జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. గవర్నింగ్ బాడీ ద్వారానే ఫీజులు నిర్ణయించాలని ఆదేశాలు జారీ చేసింది. వసూలు చేసిన ఫీజులో 5% మాత్రమే లాభం తీసుకోవాలని హెచ్చరించింది కేసీఆర్ సర్కార్.