మరి కొద్ది రోజుల్లో వేసవి రాబోతుంది. వేసవి అనగానే మొదట గుర్తువచ్చేది.. సెలవులు. వేసవి సెలవుల్లో ప్రజలు ప్రయాణాలు కాస్త ఎక్కువగానే పెట్టుకుంటారు. పాఠశాలలు, కాలేజీలకు హాలీడేస్ ఉండడంతో ఎక్కువ మంది టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. హాలీడేస్ వల్ల సొంతూళ్లకు వెళ్లడం, విహార యాత్రలు ఎక్కువ ఉంటాయి. దీని వల్ల అన్ని రైల్వే స్టేషన్లు రద్దీగా ఉంటాయి. రైళ్లల్లో కూడా ప్రయాణీకులు కాస్త ఎక్కువగానే ఉంటారు. కాగ ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి హాలీడేస్ సందర్భంగా పెరిగే రద్దీని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా కొన్ని రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. వారానికి ఇక సర్వీస్ , వారానికి మూడు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. సికింద్రాబాద్ – ఎర్నకులం, మచిలీపట్నం – కర్నూల్ తో పాటు మరి కొన్ని నగరాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ సెలవులకు ప్రత్యేక రైళ్లు
-