ప‌దో త‌ర‌గతి విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఇక నుంచి వారు కూడా అర్హులే

-

తెలంగాణ రాష్ట్ర విద్య శాఖ ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్ష రాయ‌డానికి వ‌య‌స్సును త‌గ్గిస్తు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యంతో ఇక నుంచి రాష్ట్రంలో 12 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారు కూడా ప‌దో త‌ర‌గతి చ‌ద‌వ వ‌చ్చు. అంతే కాకుండా ప‌దో త‌ర‌గ‌తి ఫైన‌ల్ ప‌రీక్షను కూడా రాయ‌వ‌చ్చు. అయితే గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌దో త‌ర‌గితి చ‌ద‌వాల‌న్నా.. ఫైన‌ల్ ప‌రీక్ష రాయాల‌న్నా.. విద్యార్థి త‌ప్ప కుండా 14 సంవ‌త్సరాల వ‌య‌స్సు క‌లిగి ఉండాలి.

కానీ తాజా గా రాష్ట్ర విద్యా శాఖ ప‌దో త‌ర‌గ‌తి చ‌ద‌వ‌డానికి విద్యార్థులకు రెండు సంవ‌త్స‌రాలు మిన‌హాయింపు ఇచ్చింది. అయితే రాష్ట్ర విద్యా శాఖ ప‌దో త‌ర‌గ‌తికి విద్యార్థుల‌కు ఇచ్చిన రెండు సంవ‌త్స‌రాల మిన‌హాయింపు వ‌ర్తించాలి అంటే.. రూ. 300 చ‌లానా క‌ట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ ఏడాది ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు రాసే విద్యార్థులు మార్చి 3 వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news