తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు సంబంధించిన షెడ్యూల్ ఇవాళనో, రేపో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ బాధ్యతలు చూసుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. ఈ ప్రక్రియ పూర్తి అయినట్టయితే 10,449 మందికి SAలుగా, 778 మంది గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, 6వేల మంది SGT లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు.
మరోవైపు జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీల, పదోన్నతుల ప్రక్రియను చేపడతామని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం పేర్కొన్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులు.. డీఎస్సీ ద్వారా అదనంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు నియంత్రణకు మూడు, నాలుగు నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు.