తెలంగాణ రాష్ట్రంలోని చెంచులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భూమిలేని చెంచులకు… ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేక కేటగిరి క్రియేట్ చేసి మరీ పది రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదంటూ ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి దాదపు 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరు చేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ….అచ్చంపేట నియోజకవర్గంలో ఎంత మంది రైతులకు మోటార్లు ఉన్నాయో అంత మంది రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంప్ సెట్లు ఇచ్చే బాధ్యత నాది అన్నారు.