తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులు అలాగే బాలికలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మహిళా సంఘాల తరహాలోనే దివ్యాంగులు అలాగే బాలికలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దివ్యాంగులలో స్త్రీ అలాగే పురుషులతో సంఘాలు ఏర్పాటు చేసి ట్రై సైకిళ్లు అలాగే వినికిడి యంత్రాలు అందించబోతున్నారు.

వ్యాపారాల కోసం రుణాలు కూడా అందిస్తారు. ఆటో 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఏళ్ల బాలికలతో… స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి నగదు పొదుపు, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కల్పించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు.