తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను అందిస్తోంది. ఇప్పటికే చాలామందికి ఇళ్లను వారికి అందించగా మరికొంతమందికి అందించేందుకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. పేదలు నివసిస్తున్న చోట జీ+3 పద్ధతిలో నిర్మాణం చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి అర్హులకు కేటాయించాలని సూచనలు జారీ చేశారు. ఇదిలా ఉండగా…. స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తోంది. స్థలం ఉండి కట్టుకోలేక ఇబ్బంది పడే వారికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద రూ. 5 లక్షల రూపాయలను అందిస్తోంది.