హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు పొడిగింపు..!

-

రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల
మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్- 2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.


పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు
కారిడార్ల డీపీఆర్ తయారీ విషయంపై చర్చించి ఈ మేరకు సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఇటు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు.. మరోవైపు ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడూ శామీర్ పేట వరకు మెట్రో రైలు పొడిగించడంతో ప్రయాణికులు సకాలంలోనే తమ గమ్యాన్ని చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version