మహిళలకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం..!

-

ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మహిళనే ఇంటికి యజమానురాలుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒకే కార్డులోకి రేషన్, హెల్త్, ఇతర పథకాలు వర్తింపజేస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులను నిర్థారణ చేస్తామని తెలిపారు. అక్టోబర్ 03వ తేదీ నుంచి ఫైలెట్ ప్రాజెక్ట్ గా పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు.

అర్హులైన వారందరికీ ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్డు ద్వారానే లబ్దిదారులు ఎక్కడినుంచి అయినా రేషన్ వస్తువులను తీసుకోవచ్చని.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందవచ్చని ఆ దిశగా ఉపయోగపడేలా ఈ కార్డులుంటాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్య అవసరాలకు చికిత్స పొందే సమయానికి సదరు వ్యక్తికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా డాక్టర్లు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ డిజిటల్ కార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version