వైద్య విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది – హరీష్ రావు

-

నేడు ఎం.ఎన్.జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 300 పడకల అంకాలజీ భవనాన్ని ప్రారంభించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎం.ఎన్.జే చారిత్రక ఆసుపత్రిలో నూతన బ్లాకును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి బిల్డింగ్ ని నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మా కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ బిల్డింగ్ రావడంతో పడకల సంఖ్య 750 కి పెరిగిందన్నారు. ప్రభుత్వపరంగా 60 కోట్లతో ఇక్కడ అన్ని సదుపాయాలను కల్పించామన్నారు హరీష్ రావు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రెండవ అతిపెద్ద ఆసుపత్రిగా ఎం.ఎన్.జే నిలిచిందన్నారు. కొత్త బ్లాక్ లో ప్రత్యేకంగా విమెన్ వింగ్, పీడియాట్రిక్ రానున్నాయని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వైద్య సేవలను ఎంతో పటిష్టం చేశారని వివరించారు. వైద్య విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి క్యాన్సర్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా 800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లో కీమోథెరపీ ప్రారంభించబోతున్నామని.. అలాగే రేడియో థెరపీని కూడా జిల్లాల్లో ప్రారంభిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version