ప్రభుత్వం ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదు – ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని బిజెపి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపించారు. దీంతో అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు – మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. శాసనసభలోనే కాదు, ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఎక్కడా గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

దక్షిణ తెలంగాణ తప్ప అభివృద్ధి మాకు లేదని.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ప్రభుత్వం పాటించడం లేదని ఆరోపించారు. శాసనసభ మాకు పెద్ద దిక్కు అన్న రాకేష్ రెడ్డి.. అందుకే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తున్న సమయంలో సభ్యులు ఇలా చేయడం సరికాదని హితవు పలికారు.

ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం జరపాలని అన్నారు బిజెపి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. విగ్రహాలు, పేర్లు మార్చడం వల్ల అభివృద్ధి జరగదన్నారు. విగ్రహం ఆవిష్కరణలో బిజెపిని పిలిచారు కానీ.. రూపకల్పనలో మా అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news