సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ లో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. కాగా ఈ కాలేజీ ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరనుంది. 220 పడకల మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ. 224.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇది సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. కాగా, గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం 5 జూలై 2023న రూ.183 కోట్లతో యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయగా అది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయని మొన్నటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వికారాబాద్ జిల్లా కొడంగల్ లో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.