తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క జాతర ప్రత్యేకత అంతా కాదు. అయితే ఈ సమ్మక్క జాతర ఈ ఏడాది జరుగుతుంది. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు చాలా ఘనంగా మేడారంలో జరగనుంది. మేడారంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల సమ్మక్క – సరళమ్మ జాతరను చాలా ఘనంగా నిర్వహించనున్నారు తెలంగాణ ప్రజలు. ఇక ఈ సమ్మక్క – సారలమ్మ జాతర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అయితే ఈ నెల 23వ తేదీన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళ్ళనున్నారు. మేడారం జాతర సందర్భంగా వారిద్దరూ సమ్మక్క, సరళమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అలాగే మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. గవర్నర్, సేమ్ రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సమ్మక్క జాతరకు వస్తారని మంత్రి సీతక్క వివరించారు.