నిర్మల్ కస్తూర్బా ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారుల చర్యలు

-

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ (జి) కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు వంట మనుషులను తొలగించడంతోపాటు విద్యాలయ ప్రత్యేక అధికారికి విద్యాశాఖ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

బెండకాయ, పప్పు సరిగా కడగకుండా వండి పెట్టడంతో కలుషితమైందని, ఈ నెల 19న 22 మంది విద్యార్థులు కడుపునొప్పితో ఆసుపత్రి పాలైనట్లు సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారి మల్లయ్యబట్టు తెలిపారు. వారికి వైద్యం అందించడంతో శనివారం డిశ్చార్జి అయ్యారని చెప్పారు. కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని వివరించారు. ప్రతిరోజూ కేజీబీవీలను తనిఖీ చేయాల్సిన జెండర్‌ కో-ఆర్డినేటర్‌ జి.శ్రీదేవిని సొంత డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశామని వెల్లడించారు. ఆమె స్థానంలో ధని జిల్లా పరిషత్‌ పాఠశాలలో పని చేస్తున్న సలోమి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగించామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version