తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ సిబ్బందికి కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. హోదామార్పు, ఉత్తర్వులు జారీచేసింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది హోదాను ‘ఆఫీసర్లు’గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ హోదా మార్పు అక్టోబర్ 7 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. స్టాఫ్ నర్స్ ను నర్సింగ్ ఆఫీసర్ గా, హెడ్ నర్స్ ను సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 ను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ గా, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1ను చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ గా మార్చింది.
కాగా, తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వర లోనే ఆసరా పెన్షన్లు పెరగనున్నాయి. అసరా పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. త్వరలోనే పెన్షన్ల పై సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని మంత్రి కేటీఆర్ ఓరుగల్లు సభలో నిన్న హింట్ ఇచ్చారు.