సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

-

సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు  నిర్వహించారు. పంగోలులోని GliS, MPH ఆడిటోరియంలో సాంస్కృతిక కళాసారధి సింగపూర్ వారి ఆధ్వర్యంలో జరిగిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో తెలుగు మహిళా ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష పై ఆమె కీలక
చేశారు. షడ్రుచుల సమ్మేళనమే.. ఉగాది అని తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయలే భావి
తరాలకు ఇచ్చే ఆస్తులని చెప్పారు. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న వేళ మన భాష గొప్పతనం
చాటేలా ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం సంతోషకరమన్నారు.

“14 ఏళ్ల తర్వాత నేను ఎంపీ హోదాలో సింగపూర్ లో ఇలా ఉగాది వేడుకల్లో పాల్గొనడం చాలా
ఆనందంగా ఉంది. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే సంతోషిస్తున్నాం. కానీ తెలుగు భాష గొప్ప
తనాన్ని వాళ్లకు నేర్పించడం లేదు. కానీ విదేశాలలో ఉన్నటువంటి మీ లాంటి వాళ్లు తెలుగు భాష గొప్ప తనాన్ని చాటుతూ, మన సంప్రదాయాలు, కట్టుబాట్లు చిన్న పిల్లలకు, భావి తరాలకు
నేర్పుతుందటం అభినందనీయం. ఈ రోజుల్లో దేవాలయాలకు వెళ్లే సంస్కృతి, భక్తిభావం తగ్గిపోతోంది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం తర్వాత హిందూ ఆచార సంప్రదాయాలకు ప్రత్యేకత పెరిగింది. ప్రతి గ్రామంలోనూ హిందూ భావం పెరిగింది. అందుకే ఏ చిన్న పండగ వచ్చినా ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి హిందువు పండగలోనూ ఒక్కో సంస్కృతి, ఆచారం దాగి ఉంది. తెలుగు కొత్త సంవత్సరం ఈ ఉగాది నుంచే ప్రారంభమవుతుంది” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version