గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు దేశవ్యాప్తంగా 160 రూపాయలకు కేజీ టమాటలు వస్తున్నాయి. ఒక నెల రోజుల కిందట 100 రూపాయలకు ఎనిమిది కిలోల చొప్పున టమాటలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కేజీకి 160 రూపాయలు పలుకుతుంది టమాట.
అయితే టమోటా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సామాన్యులకు మరో షాక్ తగిలింది. పచ్చిమిర్చి కూడా భారీగా పెరిగింది. బెంగాల్ కోల్కతాలో కిలో మిర్చి ధర రికార్డు స్థాయిలో 300 రూపాయలకు చేరింది. అలాగే అల్లం ధర కూడా అదే స్థాయిలో చేరింది. త్వరలోనే వీటి ధర 400 రూపాయలకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మిర్చిని ఎక్కువగా సాగు చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఈ ఏడాది ఇతర పంటలకు మల్లడంతో సప్లై తగ్గింది. దీంతో మిర్చి ధరలు పెరిగినట్లు చెబుతున్నారు నిపుణులు.