21 నుంచి గ్రూపు-1 పరీక్షలు జరుగుతాయి : మంత్రి సీతక్క

-

తెలంగాణలో అనుకున్న సమయానికే గ్రూపు-1 పరీక్షలు జరిగి తీరుతాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు విపక్షాల ట్రాప్ లో పడి.. జీవితాలను ఆగం చేసుకోవద్దని సీతక్క సూచించారు. నిరుద్యోగులను నిండా ముంచి పదేళ్లు కాలయాపన చేసిన
బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కి నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇదిలా
ఉండగా.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని
టీజీపీఎస్సీ కమిషన్, ప్రభుత్వం చెబుతోంది.

ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదే సమయంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించినా వారికి అనుకూలంగా తీర్పు రాకపోవడంతో అధికారులు పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  గత వారం రోజులుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. మరోవైపు  రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండంతో  గ్రూపు-1 పరీక్ష పై చాలా ఉత్కంఠగా సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version