సింధుపై దారుణంగా ట్రోలింగ్‌…తీన్మార్‌ మల్లన్న ఇజ్జత్‌ తీస్తూ వీడియో !

-

పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించారు గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా అని మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న నన్ను శంకిని అని మాట్లాడుతున్నాడన్నారు.

Group 2 candidate Sindhu reacted strongly on Congress social media

నేను ఇదే TSPSC సమస్యల మీద గత ప్రభుత్వం ఉన్నపుడు కూడా వచ్చి మాట్లాడాను.. ఆరోజు నేను శంకిని లాగా కనపడలేదా అంటూ నిలదీశారు. BRS ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొట్లాడినం….అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను కొన్నారా.. అప్పుడు నన్ను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదని ఆగ్రహించారు.

నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు నేను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్లు ఎవరైనా నిరుపించగలరా. ఒక ఆడ బిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని… ఆరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు మేము ఎక్కడుంటే అక్కడిక వచ్చి మమ్మల్ని నమ్మండి అంటూ BRS ప్రభుత్వం కంటే మంచిగా చేస్తాం అని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. ఆ రోజు AICC నేతలను కల్సినం, ప్రొఫెసర్ కోదండరాం చెప్పిన ప్రకారమే చేసినం.. అప్పుడు మమ్మల్ని ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదని తెలిపారు.

https://x.com/TeluguScribe/status/1809241557419405744

 

Read more RELATED
Recommended to you

Latest news