సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం అయ్యారు. ఈ మేరకు నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చక్రవర్తిని సీఎం చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా.. జల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ఈ ప్రజాదర్బార్‌ కార్యక్రమం పేరును తాజాగా ప్రజావాణిగా మార్చారు.

Gummi Chakraborty appointed as Chief Officer to CM Revanth Reddy

ఈ మేరకు పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం ఒక కార్యక్రమంలో ప్రకటించారు.హైదరాబాద్‌ లోని జ్యోతిబా ఫులె ప్రజాభవన్‌లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక నుంచి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రజావాణి’లో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version