మా పార్టీ వాళ్లే మాకు ఇబ్బందులు తెస్తున్నారు: గుత్తా సుఖేందర్‌రెడ్డి

-

ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో భేదాభిప్రాయాలతో కొందరు పార్టీ వీడుతున్నారని.. పార్టీ ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు పోటీ చేస్తామని తెలిపారు. ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదని.. అవసరమైతే ఈపార్టీ నుంచే ఇప్పుడే పోటీచేసే వాడినని చెప్పారు. పక్క పార్టీలోకి వెళ్లి పోటీ చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

“ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. మా పార్టీ వాళ్లే మాకు ఇబ్బందులు తెస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పని. మేడిగడ్డ బ్యారేజ్ అంశంలో కూడా అదే జరుగుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదు. కేసీఆర్‌ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలి. మూడోసారి కేసీఆర్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మరోసారి సీఎం కావాలి. తప్పిదాలను ఇతరులపై నెట్టడం రాజకీయాల్లో సహజం. నాపై కూడా కొన్ని అపవాదాలు, అసత్యాలు ప్రచారం చేశారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను” అని గుత్తా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news