శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనను పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కేసిఆర్ కు ఆపాదించడం దిక్కుమాలిన చర్య అని ఫైర్ అయ్యారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనే మలి దశ తెలంగాణ ఉద్యమానికి కారణమన్నారు. 9 సంవత్సరాల కాలంలో విద్యుత్ కోసం ఆందోళనలు జరగని రాష్ట్రం తెలంగాణ అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా నాణ్యమైన విద్యుత్ రైతులకు ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదని కొనియాడారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ వెంకట్ రెడ్డి ఇద్దరికీ వ్యవసాయమే తెలియదని చురకలు అంటించారు. అవరా నంబర్ వన్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని… కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోట దగ్గరకు వెళ్ళేది సురాపానం తాగడానికే అని ఆరోపించారు. 10 ఏళ్లు ఆయనతో కలిసి పనిచేసిన నాకు ఆ విషయం తెలుసు అన్నారు. 82 ఏళ్ల మల్లికార్జున ఏఐసీసీ అధ్యక్షుడిగా పనికి వస్తాడుగానీ…75 ఏళ్ల సీఎండీ ప్రభాకర్ రావు సీఎండీ గా పనికిరాడా అని నిలదీశారు గుత్తా.