కేటీఆర్ పై గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదని పేర్కొన్నారు బాలరాజు. విదేశాల్లో చదువుకుని ఉండొచ్చు కానీ.. నాకు ఉన్న అనుభవం కేటీఆర్ కు లేదని నేను భావిస్తున్నా అని బాంబు పేల్చారు గువ్వల బాలరాజు.

ఆకలి కేకలను వినిపించడం మొదలుపెడితే గ్రామాల్లో కేటీఆర్ ను అడుగుపెట్టనివ్వను అని వార్నింగ్ ఇచ్చారు గువ్వల బాలరాజు. కాగా గువ్వల బాలరాజుకు షాక్ ఇచ్చారు BRS కార్యకర్తలు.త మను సంప్రదించకుండా ఎలా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తావని గువ్వలపై ఎదురుతిరిగారు ఆయన అనుచరులు. గువ్వల తన నివాసంలో సమావేశం పెట్టగా, అంతంత మాత్రంగా వచ్చారు కార్యకర్తలు. గువ్వల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ఫంక్షన్ హాల్‌లో సమావేశం పెట్టుకున్నారు అనుచరులు, కార్యకర్తలు.