ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ నేషనల్ సోషల్ అసోసియేషన్ ప్రోగ్రాం కింద భాగంగా 1995లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా కార్యక్రమం. ఈ స్కీమ్ దారిద్రరేఖకు దిగువన ఉన్న 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వృద్ధులకు ఆర్థిక సాయం అందించడానికి రూపొందించారు. 2025 ఆగస్టు 5న లోక్ సభ జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం కింద పెన్షన్ మొత్తాన్నిపెంచడంపై తాజా సమాచారాన్ని అందించింది ఆ వివరాలు మనం చూద్దాం..
ప్రస్తుత పెన్షన్: ప్రస్తుతం ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మొత్తం 60 నుంచి 79 ఏళ్ల వయసు గల వారికి నెలకు 200 రూపాయలు చొప్పున అందిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి నెలకు 500 రూపాయలు చొప్పున అందిస్తుంది. రాష్ట్రాలు కేంద్ర ప్రాంత ప్రాంతాలు కేంద్రం అందించే పెన్షన్కు అదనంగా 50 రూపాయలు నుండి రూ. 3000 వరకు జోడిస్తున్నాయి దీనివల్ల చాలా రాష్ట్రాల్లో సగటు నెలవారీ పెన్షన్ 1000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉంటుంది.
పెన్షన్ పెంపు ప్రతిపాదన పై కేంద్రం స్పందన : 2025 ఆగస్టు 5న లోక్సభలో ఎంపీ రాజ్‌కుమార్ రోత్ ఈ స్కీం కింద పెన్షన్ మొత్తాన్ని 69 నుంచి 79 ఏళ్ల వయసు వారికి ₹1000 ఇస్తున్నారు. 79 ఏళ్లు వయసు పైబడిన వారికి రూ. 1500 పెంచాలని ప్రతిపాదన చేశారు. దీనికి గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పస్వాన్ స్పందిస్తూ ప్రస్తుతం ఈ విధమైన పెన్షన్ పెంపు ప్రతిపాదన ఏది కేంద్ర ప్రభుత్వం పరిచయంలో లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని NSAP మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు, కేంద్రప్రాధిత ప్రాంతాలు తమ సొంత ఆర్థిక సామర్థ్యాన్ని ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.
ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ చివరి సవరణ 2011లో జరిగింది. వయసు పరిమితి 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించారు. 80 ఏళ్ల నుండి అంతకంటే ఎక్కువ వయసుగల కలిగిన వారికి 200 నుంచి 500 కు పెంచారు. ఈ సవరణ వలన 72 లక్షల మంది 60 నుంచి 64 ఏళ్ల వయసు కలిగిన వారికి 26 లక్షల మంది 80 ఏళ్లు పైబడిన వారికి ప్రయోజనం చేకూరింది.
కొన్ని రాష్ట్రాలు తమ సొంత పెన్షన్ స్కీమ్ పాటు ఇందిరాగాంధీ స్కీం కింద టాప్ ఆఫ్ మొత్తాన్ని అందిస్తున్నాయి. ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 3,500 వరకు టాప్ ఆఫ్ అందిస్తాయి. ఉత్తరప్రదేశ్లో 60 ఏళ్లు పైబడిన వారికి 700రూపాయలు, 80 ఏళ్లు పైబడిన వారికి 1000 రూపాయలు అందిస్తున్నారు.