అందరికీ బిర్యానీ ఆకు గురించి తెలిసిందే. అయితే దీనిని కేవలం ఆహార పదార్థాలలో రుచిని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ఆకును కేవలం నీటిలో మరిగించి తాగడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బిర్యానీ ఆకులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి6 తో పాటుగా మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ వంటి మొదలైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి.
అంతేకాకుండా చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు బిర్యానీ ఆకులను నీటిలో మరిగించి తాగడం వలన ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది మరియు అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పేగు సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తాగడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. బిర్యానీ ఆకులో ఉండే ఔషధ గుణాలు రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కనుక బిర్యానీ ఆకు నీళ్లను తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ విధంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా బిర్యాని ఆకులను నీటిలో మరిగించి తాగడం వలన అదనపు కేలరీలను బర్న్ చేయవచ్చు. దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కనుక ఇటువంటి ప్రయోజనాలు అన్నిటిని పొందాలి అంటే కేవలం ఒక కప్పు నీటిలో ఒకటి లేక రెండు బిర్యాని ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. దీనిని వడకట్టి తేనె మరియు నిమ్మరసం తో తాగవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది.