ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రతిపక్షాలు ప్రమాదకరంగా మారాయని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా నిరుద్యోగం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 50 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా ఫెయిల్ కాలేదని…. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని విమర్శించారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రజలను అవమానించటమేనని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న బూటకపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యల కంటే ప్రమాదకరంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు తయారయ్యాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 50చోట్ల అభ్యర్థులు లేని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భ్రమల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.